నిర్ణీత సమయానికి వడ్డీతో కలిపి పెట్టుబడిని తిరిగి అందించడం మనకు చాల లాభదాయకంగా ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఒకే విధమైన వడ్డీ అందించవు. కాబట్టి మనకు నమ్మకమైన, వడ్డీ ఎక్కువగా వచ్చే బ్యాంకులను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ( Utkarsh Small Finance Bank) ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.
ప్రజలందరి నమ్మకమైన మరియు సురక్షితమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) ముందు వరుసలో ఉంటాయి. వివిధ బ్యాంకులు, సంస్థలు అందించే వీటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. నిర్ణీత సమయానికి వడ్డీతో కలిపి పెట్టుబడిని తిరిగి అందించడం మనకు లాభం తో కూడుకొనివుంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఒకే విధమైన వడ్డీ అందించవు. కాబట్టి మనకు నమ్మకమైన, వడ్డీ ఎక్కువగా వచ్చే బ్యాంకులను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రస్తుతం ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 9.10 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.
ఉత్కర్ష్ బ్యాంకు ఎఫ్డీ (Utkarsh Small Finance Bank)
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)కు వడ్డీ రేట్లను సవరించింది. అవి మే ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. సవరించిన రేట్ల తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు ఇప్పటికే ఉన్న ఎఫ్ డీలకు వర్తిస్తాయి.
వడ్డీరేట్ల వివరాలు..
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు సీనియర్ సిటిజన్లకు 4.6 శాతం నుంచి 9.10 శాతం వరకూ ఉన్నాయి. రెండు నుంచి మూడేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 9.10 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఇక సాధారణ పౌరులకు ఏడు రోజుల నుంచి పదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.50 శాతం వరకూ, అలాగే రెండు నుంచి మూడేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే వాటిపై అత్యధికంగా 8.5 శాతం ఇస్తున్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఏడు నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4 శాతం, 46 నుంచి 90 రోజుల 4.75% వడ్డీ రేటును అమలు చేశారు.
అకాల ఉపసంహరణ..
ఎఫ్‌డీల అకాల ఉపసంహరణకు సంబంధించి నిబంధనలు ఇలా ఉన్నాయి. అలాంటి వాటిపై పెనాల్టీ 1 శాతం ( 7 రోజుల లోపు మూసివేతకు వర్తించదు) విధిస్తారు. అంటే డిపాజిట్ తేదీ నాటికి కార్డ్ రేటు కంటే 1 శాతం తక్కువ, డిపాజిట్ మిగిలి ఉన్న కాలానికి బ్యాంక్‌తో లేదా ఒప్పంద రేటు కంటే 1 శాతం తక్కువ, వీటిలో ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా చేయబడతాయి.
డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లు..
- ఏడు నుంచి 45 రోజుల ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.60 శాతం వడ్డీని ఇస్తున్నారు.
- 46 నుంచి 90 రోజుల డిపాజిట్లపై 4.75 శాతం (సాధారణ), 5.35 శాతం (సీనియర్ సిటిజన్లు).
- 91 నుంచి 180 రోజులకు 5.50 శాతం (సాధారణ), 6.10 శాతం (సీనియర్ సిటిజన్లు).
- 181 నుంచి 364 రోజులకు 6.50 శాతం (సాధారణ), 7.10 శాతం (సీనియర్ సిటిజన్లు).
- 365 నుంచి 699 రోజులకు 8 శాతం (సాధారణ), 8.06 శాతం (సీనియర్ సిటిజన్లు).
- 700 నుంచి రెండేళ్ల లోపు 8.25 శాతం (సాధారణ), 8.85 శాతం (సీనియర్ సిటిజన్లు).
- రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు 8.50 శాతం (సాధారణ), 9.10 శాతం (సీనియర్ సిటిజన్లు).
- మూడేళ్ల నుంచి నాలుగేళ్ల లోపు 8.25 శాతం (సాధారణ), 8.85 శాతం (సీనియర్ సిటిజన్లు).
- నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు 7.75 శాతం (సాధారణ), 8.35 శాతం (సీనియర్ సిటిజన్లు).
- అయిదేళ్ల నుంచి పదేళ్ల డిపాజిట్లకు 7.25 శాతం (సాధారణ), 7.85 శాతం (సీనియర్ సిటిజన్లు).
DCB బ్యాంక్ FD వడ్డీ రేట్లు
DCB బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది . DCB బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.
19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సవరించిన తర్వాత సాధారణ కస్టమర్లకు 8% మరియు సీనియర్ సిటిజన్లకు 8.55% అత్యధిక FD వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది . అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8% వరకు అందించబడుతుంది.
ఈ పెద్ద బ్యాంక్ ఇప్పుడు పొదుపు ఖాతాపై 8% వరకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.55% వరకు వడ్డీ రేటును అందిస్తుంది.
యెస్ బ్యాంక్:
కొత్త వడ్డీ రేట్లు, ఇప్పుడు యెస్ బ్యాంక్ వారు 3.25 శాతం నుండి 8 శాతం వరకు సామాన్య ప్రజలకు వడ్డీ అందిస్తున్నారు. అన్నీ బ్యాంకుల్లో 0.50 శాతం ఎక్కువ సీనియర్ సిటిజన్లకు అందిస్తారు అంటే 3.75 శాతం నుండి 8.50 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.
గరిష్ట వడ్డీ రేటు మీరు 18 నెలల పదవీకాలం ఎంచుకుంటే మాత్రమే లభిస్తుంది. మీరు లక్ష రూపాయిలు పెట్టుబడి 18 నెలల పదవీకాలం వరకు పెట్టుబడి పెడితే సామాన్య ప్రజలకు రూ.1,11,902 మరియు సీనియర్ సిటిజన్లకు రూ.1,12,658 లభిస్తుంది.
ఎస్‌బిఐ బ్యాంక్:
ప్రస్తుతం ఎస్‌బిఐ బ్యాంకులో 5.50 శాతం వడ్డీ 46 నుండి 179 రోజులు మీద అందిస్తున్నారు, అదే సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ అందిస్తారు. సామాన్య ప్రజలకు 180 నుండి 210 రోజులు మీద 6 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.
గరిష్టమైన వడ్డీ రేటు 7.60 శాతం మీరు 400 రోజుల పదవీకాలం ఎంచుకుంటే మాత్రమే లభిస్తుంది, మీరు లక్ష రూపాయిలు ఈ పదవీకాలం వరకు పెట్టుబడి పెడితే మీకు పదవీకాలం తరువాత రూ.1,18,317.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్:
సామాన్య ప్రజలకు 3.25 శాతం నుండి 7.25 శాతం 7-10 సంవత్సరాల ఎఫ్‌డి పదవీకాలం మీద అందిస్తున్నారు. ప్రస్తుతం 18-21 నెలల పదవీకాలం మీద 7.25 శాతం వడ్డీ అందిస్తున్నారు మరియు సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.
ఇప్పుడు మీరు 18-21 పదవీకాలం వరకు లక్ష రూపాయిలు పెట్టుబడి పెడితే, మీకు రూ.1,15,400 లభిస్తుంది.
ఐసిఐసిఐ బ్యాంక్:
ప్రస్తుతం వడ్డీ రేట్లు సవరించిన తరువాత 3 శాతం నుండి 7.20 శాతం వడ్డీ 7-10 సంవత్సరాల పదవీకాలం మీద అందిస్తున్నారు మరియు సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుండి 7.75 శాతం వరకు లభిస్తుంది.
గరిష్టమైన వడ్డీ మీకు 15 నెలలు నుండి 2 సంవత్సరాలు పదవీకాలం ఎంచుకుంటే మాత్రమే లభిస్తుంది. ఈ పదవీకాలం మీద మీరు లక్ష రూపాయిలు పెట్టుబడి పెడితే రెండు సంవత్సరాల తరువాత రూ.1,15,400 లభిస్తుంది.
ఆక్సీస్ బ్యాంక్:
ప్రస్తుతం వడ్డీ రేట్లు సవరించిన తరువాత 3 శాతం నుండి 7.20 శాతం వడ్డీ 7-10 సంవత్సరాల పదవీకాలం మీద అందిస్తున్నారు మరియు సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుండి 7.85 శాతం వరకు లభిస్తుంది.
గరిష్టమైన వడ్డీ మీకు 17 నెలలు నుండి 18 నెలలు పదవీకాలం ఎంచుకుంటే మాత్రమే లభిస్తుంది. ఈ పదవీకాలం మీద మీరు లక్ష రూపాయిలు పెట్టుబడి పెడితే 18 నెలల తరువాత రూ.1,11,043 లభిస్తుంది.
కానరా బ్యాంక్:
ప్రస్తుతం వడ్డీ రేట్లు సవరించిన తరువాత 4 శాతం నుండి 7.25 శాతం వడ్డీ 7-10 సంవత్సరాల పదవీకాలం మీద అందిస్తున్నారు మరియు సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుండి 7.75 శాతం వరకు లభిస్తుంది.
గరిష్టమైన వడ్డీ మీకు 444 రోజుల ప్రత్యేక పథకం పదవీకాలం ఎంచుకుంటే మాత్రమే లభిస్తుంది. ఈ పదవీకాలం మీద మీరు లక్ష రూపాయిలు పెట్టుబడి పెడితే 444 రోజుల తరువాత రూ.1,09,413 లభిస్తుంది.
ఐడీఎఫ్‌సీ
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి
బ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది.
Leave a Reply
You must be logged in to post a comment.